జీ సినిమాలు - జూన్ 14

Saturday,June 13,2020 - 08:00 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త
నటీనటులు : సిబిరాజ్, అరుంధతి
ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్
డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్
ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్
రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014
సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్
కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

==========================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్,
చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్
లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

===============================

కందిరీగ
నటీనటులు : రామ్, హన్సిక మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్,
శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011
ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

===========================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్,
తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

===============================

అన్నవరం
నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్
ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B.
శ్రీరామ్, హేమ
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

============================

యోగి
నటీనటులు : ప్రభాస్, నాయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017
ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.