జీ సినిమాలు (జులై 8th)

Friday,July 07,2017 - 10:00 by Z_CLU


నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ
ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ
డైరెక్టర్ : సురేష్ కృష్ణ
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

———————————————————————————————

నటీనటులు : సుమంత్, స్వాతి
ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్
డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

——————————————————————————————–


నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010

విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

——————————————————————————————-

హీరోహీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార
సంగీతం – హరీష్ జైరాజ్
దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్
విడుదల తేదీ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

———————————————————————————————–

హీరోహీరోయిన్లు – నాగచైతన్య, కృతి సనోన్
నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్
సంగీతం – సన్నీ
దర్శకత్వం – సుధీర్ వర్మ
విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

———————————————————————————————


నటీనటులు : విశాల్, హన్సిక
ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సుందర్ C.
ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.