ZeeCinemalu - July 15

Wednesday,July 14,2021 - 09:22 by Z_CLU

sudigadu-zee-cinemalu

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్,
చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

============================

pilla-zamindar-zee-cinemalu

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్,
ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి
చేసిన సినిమా ఇదే.

==========================

nenu-local-zee-cinemalu

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

==========================

chal-mohan-ranga-zee-cinemalu

ఛల్ మోహన్ రంగ
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : కృష్ణ చైతన్య
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018
చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో
పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.

============================

iSmart-Shankar-fpc-zeecinemalu

ఇస్మార్ట్ శంకర్
నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్
రిలీజ్ డేట్ : జులై 18, 2019
ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది. తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి
ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్). ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

=======================

Sikandar-zee-cinemalu

సికిందర్
నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి
శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : N. లింగుస్వామి
ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014
సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.