ZeeCinemalu - July 12

Sunday,July 11,2021 - 09:02 by Z_CLU

Anushka-nishabdham-movie-zeecinemalu
నిశ్శబ్దం
నటీ నటులు : అనుష్క , మాధవన్ , అంజలి , సుబ్బరాజు , శాలిని పాండే తదితరులు
సంగీతం : గోపీసుందర్
నేపథ్య సంగీతం : గిరీష్ గోపాలకృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కోనా వెంకట్
నిర్మాత : TG విశ్వప్రసాద్
రచన -దర్శకత్వం : హేమంత్ మధుకర్
విడుదల తేది : 1 అక్టోబర్ 2020
మర్డర్ మిస్టరీస్ టాలీవుడ్ కి కొత్త కాదు. కానీ అనుష్క ‘నిశ్శబ్దం’ మాత్రం కాస్త డిఫెరెంట్. మరీ ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్స్ ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకం అనిపిస్తుంది. సాక్షి పాత్రలో అనుష్క నటన సినిమాకే హైలైట్.

========================

memu-zee-cinemalu-surya

మేము
నటీనటులు : సూర్య, అమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015
పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

===========================

saakshyam-zee-cinemalu-bellamkonda

సాక్ష్యం
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, ఆశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వర్
డైరెక్టర్ : శ్రీవాస్
ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.
అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.
ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.

============================

Cheekati-చీకటి-fpc-zeecinemalu

చీకటి
నటీనటులు – సుందర్ సి, గణేశ్, సాక్షి చౌదరి, సాయిధన్సిక, విమలా రామన్
దర్శకత్వం – వీజెడ్ దురై
సంగీతం – గిరీష్ జి.
డీవోపీ – కృష్ణస్వామి
రన్ టైమ్ – 132 నిమిషాలు
మధ్యాహ్నం 12 గంటలకు ఓ హిల్ స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడున్న వ్యక్తులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. ఇంతలో సడెన్ గా కొండల నుంచి ఓ పెద్ద కొండచిలువ వస్తుంది. అది చూసి అంతా పారిపోతారు. అదే టైమ్ లో సడెన్ గా చీకటి పడుతుంది. ఆ చీకట్లో ఆ ప్రాంతానికి చెందిన ఐదుగురు హత్యకు గురవుతారు. అదే ప్రాంతానికి ట్రాన్సఫర్ పై వచ్చిన పోలీసాఫీసర్ సుందర్ సి. ఆ హత్యల్ని దర్యాప్తు చేస్తుంటారు. అంతుచిక్కని ఆ చీకటి సుందర్ సి కుటుంబాన్ని కూడా కమ్మేస్తుంది. ఫైనల్ గా సుందర్ సి. ఆ కేసును ఛేదించాడా లేదా? ఆ ప్రాంతానికి, చీకటికి ఉన్న సంబంధం ఏంటనేది ఈ సినిమా స్టోరీ.

=========================

abcd-zee-cinemalu-allu-sirish

ఏబీసీడీ
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019
న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.
అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.