ZeeCinemalu - Jan 9

Friday,January 08,2021 - 10:31 by Z_CLU

బంగారుతల్లి
నటీనటులు : జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ తదితరులు
దర్శకత్వం : జె జె ఫ్రెడ్రిక్
నిర్మాత‌లు : సూర్య
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫర్ : రాంజీ
ఎడిటర్: రూబెన్
ఊటీలో జ్యోతి అనే మ‌హిళ‌.. కొంత‌మంది చిన్న‌పిల్ల‌ల్ని దారుణంగా చంపేస్తుంది. అడ్డొచ్చిన ఇద్ద‌రు యువ‌కుల్ని నాటు తుపాకీతో కాల్చి చంపేస్తుంది. ఆ మ‌హిళ‌ని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత ఈ కేసుని వెన్నెల (జ్యోతిక‌) అనే లాయ‌రు తిరిగి ఓపెన్ చేస్తుంది. అసలు నిజాల్ని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తుంది.
ఈ పోరాటంలో పెద్ద మ‌నిషిగా చ‌లామ‌ణీ అవుతున్న వ‌ర‌ద‌రాజులు (త్యాగ‌రాజ‌న్‌), తిమ్మిని బ‌మ్మిగా చేసే ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజార‌త్నం (పార్తీబ‌న్‌)ని ఎదుర్కోవాల్సివ‌స్తుంది వెన్నెల‌. అస‌లు సైకో జ్యోతి ఎవ‌రు? ఆమె నిజంగా పిల్లల్ని చంపేసిందా? ఆమెకీ వెన్నెల‌కూ ఉన్న లింక్ ఏంటనేది బ్యాలెన్స్ కథ.

========================

దేవదాస్
నటీనటులు : నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్
ఇతర నటీనటులు : R. శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, నరేష్, సత్య కృష్ణన్, మురళీ శర్మ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.
మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

=========================

అ..ఆ
నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 2 జూన్ 2016
నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

==========================

అరవింద సమేత
నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018
కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.
అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

===========================

వెళ్లిపోమాకే
నటీనటులు – విశ్వక్ సేన్, నిత్యశ్రీ, సుప్రియ, ప్రశాంత్
దర్శకత్వం – యాకుబ్ అలీ
నిర్మాత – దిల్ రాజు
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మ్యూజిక్ – ప్రశాంత్ విహారి
రిలీజ్ డేట్ – సెప్టెంబర్ 2, 2017
విశ్వక్ సేన్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా వెళ్లిపోమాకే. ఈ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్. మంచి ఎమోషన్స్ తో ఎట్రాక్ట్ చేశాడు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

యానిమేషన్ ఫీల్డ్ లో పనిచేసే హీరో, తనను ఎవరైనా ప్రేమిస్తే బాగుంటుందని అనుకుంటాడు. తన ఆఫీస్ లో కొత్తగా చేరిన ఓ అమ్మాయిపై మనసు పడతాడు. కానీ ఆమెకు అప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి చాలా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉండగా.. విశ్వక్ కు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి నుంచి విడిపోతాడు. ఇంతకీ ఎందుకిలా జరిగింది?
ఇద్దరిలో తప్పు ఎవరిది? ఫైనల్ గా విశ్వక్ జీవితంలో ప్రవేశించిన ఆ అమ్మాయి ఎవరు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

========================

loukyam-zee-cinemalu-586x276

లౌక్యం
నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : శ్రీవాస్
ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.