ZeeCinemalu - Jan 23

Friday,January 22,2021 - 09:43 by Z_CLU

పేపర్ బాయ్
నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్
ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : V. జయశంకర్
ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018
పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=========================

rarandoi-veduka-chuddam-రారండోయ్-వేడుక-చూద్దాం-naga-chaitanya-rakul-512x298

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

========================

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

-=========================

అ..ఆ
నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 2 జూన్ 2016
నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

===========================

ఇస్మార్ట్ శంకర్
నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్
రిలీజ్ డేట్ : జులై 18, 2019
ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది. తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్). ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

==========================

అర్జున్ సురవరం
తారాగణం: నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019
అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.