ZeeCinemalu - Jan 21

Wednesday,January 20,2021 - 10:42 by Z_CLU

subrahmanyapuram-zee-cinemalu-586x2671

సుబ్రమణ్యపురం
నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : సురేష్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఆలీ, సురేష్, జోష్ రవి, భద్రం గిరి, మాధవి, హర్షిని, TNR తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి
ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

======================

Brand-babu-zee-cinemalu

బ్రాండ్ బాబు
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

========================

Ninne-Istapaddanu-నిన్నే-ఇష్టపడ్డాను-Zeecinemalu-427x3201

నిన్నే ఇష్టపడ్డాను
నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు
దర్శకుడు – కొండ
డైలాగ్స్ – కోన వెంకట్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
సంగీతం – ఆర్పీ పట్నాయక్
రిలీజ్ – జూన్ 12, 2003
వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన
సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది. భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత (శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ.
ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

==============================

okato-number-kurradu-ఒకటో-నంబర్-కుర్రాడు-zeecinemalu-580x320

ఒకటో నంబర్ కుర్రాడు
నటీనటులు : తారకరత్న, రేఖ
ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : కోదండరామిరెడ్డి
ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002
తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

===========================

babu-bangaram-zee-cinemalu-586x260

బాబు బంగారం
నటీనటులు : వెంకటేష్, నయనతార
ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V . ప్రసాద్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016
తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

==========================

chal-mohan-ranga-zee-cinemalu-569x320-569x3201

ఛల్ మోహనరంగ
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : కృష్ణ చైతన్య
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018
చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.