ZeeCinemalu - Feb 22

Sunday,February 21,2021 - 09:21 by Z_CLU

36 వయసులో
నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
నిర్మాత: సూర్య
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
రిలీజ్ డేట్: 24 జులై, 2020
వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో
కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

=======================

n b

రాఖీ
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006
NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==========================

W/O రణసింగం
నటీనటులు – విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్
మ్యూజిక్ – గిబ్రాన్
దర్శకత్వం – విరుమాండి
బ్యానర్ – కేజేఆర్ స్టుడియోస్
నిర్మాత – కోటపడి రాజేష్
రిలీజ్ డేట్ – అక్టోబర్ 2, 2020
రిలీజ్ – జీ స్టుడియోస్, జీ ప్లెక్స్
చిన్న ఊరిలో ఉండే రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. ఊరిలో ఏ చిన్న సమస్య వచ్చినా తనే ముందుండి పోరాడతాడు. ఈ క్యారక్టర్ నచ్చడం తో హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్, రణసింగంని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఓ బిడ్డ కూడా పుట్టిన తర్వాత.. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తాడు రణసింగం.

అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురు అవుతాయి, హీరో పనిచేసే పరిశ్రమ లో గొడవల వలన హీరో చనిపోతాడు.
అతడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించడం కష్టంగా మారుతుంది. భర్త మృతదేహాన్ని ఇండియాకు  రప్పించేందుకు, హీరోయిన్ ఎలా పోరాడింది, అసలు ఏం జరిగింది లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచిన ఐశ్వర్య రాజేష్, అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

=======================

క్వీన్
నటీనటులు – రమ్యకృష్ణ, అనికా సురేంద్రన్, ఇంద్రజిత్ సుకుమారన్, అంజనా జయప్రకాష్, వంశీకృష్ణ
తదితరులు
దర్శకత్వం – గౌతమ్ మీనన్
సంగీతం – శివ
సినిమాటోగ్రఫీ – ఎస్ఆర్ ఖాదిర్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
ప్రొడక్షన్ కంపెనీ – ఎమ్ఎక్స్ ప్లేయర్
ఓ శివగామి.. ఓ శైలజారెడ్డి.. ఓ శక్తిశేషాద్రి.. శివగామి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. శైలజారెడ్డి గురించి కూడా చాలామందికి తెలుసు. త్వరలోనే శక్తి శేషాద్రిని కూడా చూడబోతున్నారు. అవును.. మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. ఆమె నటించిన సినిమా క్వీన్. లేడీ సూపర్ స్టార్ గా… యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా.. యావత్ రాష్ట్రానికి అమ్మగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో శక్తి శేషాద్రి పాత్రలో కనిపించారు రమ్యకృష్ణ.

ఈ ప్రతిష్టాత్మక, భారీ బడ్జెట్ మూవీను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరక్ట్ చేశాడు. ఇందులో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు రమ్యకృష్ణ. అరుదుగా మాత్రమే ఇలాంటి రోల్స్ వస్తుంటాయి. అలాంటి అరుదైన రోల్ ను రమ్యకృష్ణ పోషించారు.

========================

ఫోరెన్సిక్
నటీనటులు : తొవినో థామస్ , మమత మోహన్ దాస్ ,సిజ్జు, రేంజి , రెబా మోనికా ,రోనీ డేవిడ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్
డైరెక్టర్ : అఖిల్ పౌల్
ప్రొడ్యూసర్ : నేవిక్స్ , సిజు
రిలీజ్ డేట్ : 28 ఫిబ్రవరి 2020
‘ఫోరెన్సిక్’ క్రైం మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారిని సినిమా బాగా ఆకట్టుకుంటుంది. కథ -కథనంతో పాటు నేపథ్య సంగీతం మమత మోహన్ దాస్ , థామస్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్.

========================

కోమాలి 2020
రిలీజ్ డేట్ – 4 డిసెంబర్, 2020
నటీనటులు – జయం రవి, కాజల్ అగర్వాల్, యోగిబాబు
దర్శకుడు : ప్రదీప్ రంగనాథ్
సంగీత దర్శకుడు : హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రాఫర్ : రిచర్డ్ ఎం.నాథన్
నిర్మాత : ఐసరి కె.గణేష్
బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్
జయంరవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ కోమాలి. 1999 డిసెంబర్ 31న యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిన రవి (జయం రవి) సరిగ్గా 16 ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ సరికొత్త ప్రపంచంలో అతడు ఎలా నిలదొక్కుకున్నాడు? లోకల్ ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాడు అనేది క్లుప్తంగా “కోమాలి” కథాంశం. ఈ క్రమంలో రవికి కాజల్ ఎలా సహాయం చేసిందనేది స్టోరీ.
ఇందులో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సంయుక్తా హెగ్డే కీలక పాత్రలో కనిపించింది. ఇక కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిజ్ సంగీతం అందించారు.