జీ సినిమాలు (నవంబర్ 1st)

Wednesday,November 30,2016 - 08:00 by Z_CLU

padaharella-vayasu

హీరోహీరోయిన్లు – చంద్రమోహన్, శ్రీదేవి
నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల – 1978, ఆగస్ట్ 31

అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్ అయిన 16-వయతనిళ్లే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు. చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

——————————————————————

mundadugu

నటీ నటులు : సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సూర్య కాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. చక్రవర్తి

డైరెక్టర్ : K. బాపయ్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1983

శోభన్ బాబు, కృష్ణ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందడుగు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులిద్దరూ అన్నాదమ్ములని తెలుసుకునే సన్నివేశం సినిమాకే హైలెట్. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

——————————————————————

sri_rama_rajyam

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, నయన తార

ఇతర నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీకాంత్, రోజా, మురళి మోహన్, M. బాలయ్య, బ్రహ్మానందం, A.V.S. తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  ఇళయరాజా

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : యలమంచిలి సాయి బాబు, సందీప్, కిరణ్

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2011

బాలకృష్ణ హీరోగా బాపు డైరెక్షన్ లో అద్భుత చిత్రం శ్రీరామ రాజ్యం. తెలిసిన కథే అయినా బాపు గారు ఒక్కో సన్నివేశానికి తనదైన శైలిలో ప్రాణం పోసి మరీ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఏకంగా 7 నంది అవార్డులను సాధించి పెట్టింది. ఈ సినిమాకు ఇళయ రాజా సంగీతం అందించారు.

——————————————————————

village-lo-vinayakudu-021

నటీ నటులు : కృష్ణుడు, శరణ్య మోహన్, వీరేంద్ర నాథ్ యండమూరి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : సాయి కిరణ్ అడివి

ప్రొడ్యూసర్ : మహి V రాఘవ్

రిలీజ్ డేట్ : 5 నవంబర్ 2009

కృష్ణుడు హీరోగా నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ ‘విలేజ్ లో వినాయకుడు’. శరణ్య మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లో కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకుడు.

——————————————————————

greeku-veerusu-latest-poster

నటీ నటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

——————————————————————

sakuni

నటీ నటులు : కార్తీ, ప్రణీత

ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : శంకర్ దయాళ్

ప్రొడ్యూసర్ : S. R. ప్రభు

రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.