జీ సినిమాలు (డిసెంబర్ 18th)

Saturday,December 17,2016 - 09:30 by Z_CLU

mr-pellam

నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఇతర నటీనటులు : A.V.S, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, గుండు సుదర్శన్, జెన్నీ, మాస్టర్ ఉదయ్, బేబీ అనురాధ

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : గవర పార్థ సారథి

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 1993

బాపు గారు తెరకెక్కించిన అద్భుతాలలో Mr. పెళ్ళాం ఒకటి. ఆలు, మగలలో ఎవరు గొప్ప అనే సున్నితమైన అంశంతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ‘మిస్టర్ పెళ్ళాం’ లో రాజేంద్ర ప్రసాద్. ఆమని జంటగా నటించారు. ఈ సినిమాకి M.M. కీరవాణి సంగీతం అందించారు.

——————————————————————

dharma-chakram

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996
విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

——————————————————————

indrudu-chandrudu

నటీ నటులు : కమల హాసన్, విజయశాంతి

ఇతర నటీనటులు : శ్రీ విద్య, నగేష్, చరణ్ రాజ్, జయలలిత, P.L.నారాయణ, గొల్లపూడి మారుతి రావు, E.V.V. సత్యనారాయణ.

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1989

విలక్షణ నటుడు కమల హాసన్ కరియర్ లో ఇంద్రుడు చంద్రుడు సినిమాది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ యువకుడిగా, కరప్టెడ్ మేయర్ గా కమల హాసన్ నటించిన తీరు సినిమాకే హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు. ఇళయరాజా సంగీతం సినిమాకి మరో ఎసెట్.

——————————————————————

sarpayagam

 

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, రోజా

నటీనటులు – వాణివిశ్వనాథ్, రేఖ, నగేష్, నూతనప్రసాద్, బ్రహ్మానందం, సాయికుమార్

సంగీతం – విద్యాసాగర్

నిర్మాత – డా. డి.రామానాయుడు

రచన, దర్శకత్వం – పరుచూరి బ్రదర్స్

విడుదల తేదీ – 1991

తెలుగు సినిమాలో మాటల ప్రవాహానికి గేట్లు తెరిచిన రచయితల ద్వయంగా అప్పటికే పరుచూరి బ్రదర్స్ కు ఓ పేరు వచ్చేసింది. అప్పటివరకు ఓ రకమైన పడికట్టు పదాలతో సాగిన తెలుగు సినిమా డైలాగుల్ని సమూలంగా మార్చేశారు ఈ స్టార్ బ్రదర్స్. అలా మాటలతో పాపులరైన ఈ బ్రదర్స్ ను దర్శక ద్వయంగా చూపించారు నిర్మాత రామానాయుడు. పరుచూరి బ్రదర్స్ దర్శకులుగా మారి తెరకెక్కించిన సినిమా సర్పయాగం. ఫ్యామిలీ హీరో శోభన్ బాబును మోస్ట్ ఎమోషనల్ యాంగ్రీ యంగ్ మేన్ గా చూపించిన సినిమా ఇది.

——————————————————————

govula-gopanna

 

నటీనటులు : అక్కినేని నాగేశ్వరావు, రాజ్ శ్రీ, భారతి

ఇతర నటీనటులు : గుమ్మడి, రేలంగి, చలం, లక్ష్మి రాజ్యం, సుకన్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటసాల

డైరెక్టర్ : సి.ఎస్.రావు

ప్రొడ్యూసర్ : లక్ష్మి రాజ్యం, శ్రీధర్ రావు, సుందర్ లాల్

రిలీజ్ డేట్ : 19ఏప్రిల్ 1968

అక్కినేని నాగేశ్వరావు హీరో గా సి.ఎస్ .రావు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘గోవుల గోపన్న’. ఈ సినిమాలో పల్లెటూరి లో గోవులను కాసే గోపన్నగా అక్కినేని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రొమాంటిక్, కామెడీ సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఘంటసాల అందించిన పాటలు ఈ సినిమాకే హైలైట్

——————————————————————

zanjeer

 

నటీనటులు : రామ్ చరణ్ , ప్రియాంక చోప్రా

ఇతర నటీనటులు : సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీహరి తనికెళ్ళ భరణి తదితరులు

డైరెక్టర్ : అపూర్వ లఖియా

ప్రొడ్యూసర్ : రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, పునీత్ ప్రకాష్ మెహ్రా ,సుమీత్ ప్రకాష్ మెహ్రా, ఫ్లైయింగ్ టర్టిల్ ఫిలిమ్స్

రిలీజ్ డేట్ : 3 సెప్టెంబర్ 2013

రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించిన చిత్రం ‘జంజీర్’. ఈ సినిమాతో హిందీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్. క్రైమ్ సన్నివేశాలు, ప్రియాంక గ్లామర్,సంజయ్ దత్, శ్రీహరి క్యారెక్టర్స్ , పాటలు తో పాటు రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్స్.