జీ సినిమాలు (నవంబర్ 10th)

Friday,December 09,2016 - 09:30 by Z_CLU

jaganmohini

నటీనటులు : రాజా , నమిత
ఇతర నటీనటులు : నిల, వడివేలు, కోట శ్రీనివాస్ రావు, జ్యోతి లక్ష్మి, ఊర్వశి
మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా
డైరెక్టర్ : ఎన్.కె.విశ్వనాధ్
ప్రొడ్యూసర్ : హెచ్. మురళి

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

రాజా, నమిత హీరో హీరోయిన్లుగా దర్శకుడు విశ్వనాధ్ రూపొందించిన సోషియో ఫాంటసీ సినిమా ‘జగన్మోహిని’. ఈ సినిమాలో నమిత గ్లామర్, రాజా , కోట శ్రీనివాస్ యాక్టింగ్, గ్రాఫిక్స్ తో కూడిన సీన్స్, పాటలు హైలైట్స్.

——————————————————————

hanumanthu

నటీ నటులు : శ్రీహరి, మధు శర్మ, KR విజయ
ఇతర నటీనటులు : విజయ్ చందర్, రంగనాథ్, ప్రదీప్ రావత్, పింకీ సర్కార్, మానస, దేవి శ్రీ, LB శ్రీ రామ్, కొండవలస, వేణు మాధవ్, కోవై సరళ
మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్
డైరెక్టర్ : చంద్ర మహేష్
ప్రొడ్యూసర్ : శాంత కుమారి
శ్రీహరి హీరోగా తెరకెక్కిన హనుమంతు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన పక్కా హిట్ ఫార్ములా తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. పల్లెటూరిలో ఉండే ఒక సాధారణ వ్యక్తి, తన గతం తెలుసుకుని, తన తండ్రి చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పి, సగంలోనే సమసిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం కోసం పోరాడే కొడుకుగా, ఫ్లాష్ బ్యాక్ లో స్వాన్త్రం కోసం పోరాడే యోధుడిగా అద్భుతంగా నటించాడు శ్రీహరి. ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ప్రాణం.

——————————————————————

naidu-gari-kutumbam

నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు
ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : బోయిన సుబ్బారావు
ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు
రిలీజ్ డేట్ : 1996

సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

——————————————————————

mangataya-tiffine-centre

నటీనటులు – ముమైత్ ఖాన్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, అలీ, సుమన్ షెట్టి
సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ
దర్శకత్వం – వెంకీ
విడుదల తేదీ – 2008
ముమైత్ ఖాన్ అందాలతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మంగతాయారు టిఫిన్ సెంటర్ చూడాల్సిందే. అప్పటికే ఐటెంసాంగ్స్ తో ఫుల్ పాపులర్ అయిన ముమైత్ ఖాన్… లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఎమ్మెస్ నారాయణ, అలీ, కృష్ణభగవాన్ కామెడీ ఈ సినిమాకు హైలెట్.

——————————————————————

strawberry-telugu-front_cover

నటీనటులు : పా. విజయ్ , అవని మోడీ
ఇతర నటీనటులు : సముథిరఖని , యువీని పార్వతి, వేత్రి, దేవయాని, కవితాలయ కృష్ణన్ తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్
డైరెక్టర్ : పా.విజయ్
ప్రొడ్యూసర్ : పా.విజయ్
రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్ 2015

పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘స్ట్రాబెరి’. ఈ సినిమాలో హారర్ కామెడీ , రొమాంటిక్ సీన్స్, తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

——————————————————————

pooja

నటీనటులు : విశాల్, శృతి హాసన్
ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్, తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : హరి
ప్రొడ్యూసర్ : విశాల్
రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .