ZeeCinemalu - Dec 28

Sunday,December 27,2020 - 10:20 by Z_CLU

pilla-zamindar-zee-cinemalu-551x320

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

========================

36-Vayasulo-fpc-zeecinemalu-696x614

36 వయసులో
నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
నిర్మాత: సూర్య
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
రిలీజ్ డేట్: 24 జులై, 2020
వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో
కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

=============================

Bangaru_Thalli-fpc-బంగారు_తల్లి-మూవీ-zeecinemalu-600x338

బంగారు తల్లి
నటీనటులు : జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ తదితరులు
దర్శకత్వం : జె జె ఫ్రెడ్రిక్
నిర్మాత‌లు : సూర్య
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫర్ : రాంజీ
ఎడిటర్: రూబెన్
ఊటీలో జ్యోతి అనే మ‌హిళ‌.. కొంత‌మంది చిన్న‌పిల్ల‌ల్ని దారుణంగా చంపేస్తుంది. అడ్డొచ్చిన ఇద్ద‌రు యువ‌కుల్ని నాటు తుపాకీతో కాల్చి చంపేస్తుంది. ఆ మ‌హిళ‌ని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత ఈ కేసుని వెన్నెల (జ్యోతిక‌) అనే లాయ‌రు తిరిగి ఓపెన్ చేస్తుంది. అసలు నిజాల్ని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తుంది.
ఈ పోరాటంలో పెద్ద మ‌నిషిగా చ‌లామ‌ణీ అవుతున్న వ‌ర‌ద‌రాజులు (త్యాగ‌రాజ‌న్‌), తిమ్మిని బ‌మ్మిగా చేసే ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజార‌త్నం (పార్తీబ‌న్‌)ని ఎదుర్కోవాల్సివ‌స్తుంది వెన్నెల‌. అస‌లు సైకో జ్యోతి ఎవ‌రు? ఆమె నిజంగా పిల్లల్ని చంపేసిందా? ఆమెకీ వెన్నెల‌కూ ఉన్న లింక్ ఏంటనేది బ్యాలెన్స్ కథ.

===============================

maguvalumatrame-zeecinemalu-fpc-780x468-1-780x468

మగువలకు మాత్రమే
నటీ నటులు : జ్యోతిక , ఊర్వసి , నాజర్, భాను ప్రియ , శరణ్య పోన్వన్నం
ఛాయాగ్రహణం : మణికందన్
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : సూర్య
దర్శకత్వం : బ్రహ్మ
విడుదల : 12 సెప్టెంబర్ 2020
జ్యోతిక ప్రధాన పాత్రలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని తెర‌పైన చూపిస్తూ, వాటికో పరిష్కారం చెప్పే ప్ర‌య‌త్నం ‘మగువలు మాత్రమే’. మంచి కథనంతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను సూర్య నిర్మించారు. బ్రహ్మ దర్శకత్వం వహించిన జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

==========================

linga-zee-cinemalu-533x320

లింగ
నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా
ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్
డైరెక్టర్ : K.S. రవి కుమార్
ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్
రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

========================

ready-zee-cinemalu

రెడీ
నటీనటులు : రామ్, జెనీలియా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008
రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.