జీ సినిమాలు ( 1st December )

Monday,November 30,2020 - 10:01 by Z_CLU

నా పేరు సూర్య

నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి
డైరెక్టర్ : వక్కంతం వంశీ
ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్
రిలీజ్ డేట్ : 4 మే 2018

సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు.

అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

__________________________________________________

నటీ నటులు : సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సూర్య కాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. చక్రవర్తి

డైరెక్టర్ : K. బాపయ్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1983

శోభన్ బాబు, కృష్ణ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందడుగు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులిద్దరూ అన్నాదమ్ములని తెలుసుకునే సన్నివేశం సినిమాకే హైలెట్. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

___________________________________________

శ్రీమంతుడు

నటీనటులు : మహేష్ బాబు, శృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, సుకన్య, సితార, ముకేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్ష, ఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనే, ఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకి, తన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..? తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

______________________________

సౌఖ్యం

నటీనటులు : గోపీచంద్రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషిప్రదీప్ రావత్దీవన్బ్రహ్మానందంజయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్రెజీనా జంటగా నటించిన ఫ్యాఅమిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_______________________________________

కంత్రి

నటీనటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

_____________________________________________

ఏబీసీడీ

నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019

న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.

అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.