జీ ఎక్స్ క్లూజీవ్: భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు

Monday,May 13,2019 - 12:55 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్లుగా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ , ధన్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సత్య, సప్తగిరి ఇలా కొంతమంది కమెడియన్లు కలిసి… ఫ్లయింగ్ కలర్స్ పేరుతో అప్పుడప్పుడూ కలుస్తూ పార్టీలు చేసుకుంటుంటారు.

అదే పేరుతు వీళ్లంతా కలిసి బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఆ బ్యానర్ పై సినిమా ఎప్పుడొస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్న టైమ్ లో ఏకంగా ఓ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు ఈ హాస్యనటులు. అవును.. కమెడియన్లంతా కలిసి చేసిన ఆ సినిమా పేరు ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’.

టైటిల్ మాత్రమే కాదు, సినిమా కూడా భలే గమ్మత్తుా ఉంటుందంటున్నాడు శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. లెజెండ్ బ్రహ్మానందం నుంచి ఇప్పటి కమెడియన్ల వరకు అంతా ఈ సినిమాలో ఉంటారట.

ఈ సినిమాతో మొదలుపెట్టి ఇకపై అందరి డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఏడాదికో సినిమా ప్లాన్ చేస్తామంటోంది ఈ కమెడియన్స్ గ్రూప్. త్వరలోనే ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా డీటెయిల్స్ అఫీషియల్ గా బయటకు రాబోతున్నాయి.