జీ సినిమాలు - ఆగస్ట్ 4

Monday,August 03,2020 - 10:32 by Z_CLU

డోర
నటీనటులు : నయనతార, తంబి రామయ్య
ఇతర నటీనటులు : హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త
మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి
ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్
రిలీజ్ డేట్ : 31 మార్చి 2017
అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

=============================

ప్రేమించుకుందాం రా
నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి
ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ
ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 9 మే 1997
తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

=========================

ఒంగోలుగిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

========================

ఇది మా ప్రేమకథ
నటీనటులు : రవి, మేఘనా లోకేష్
ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీను, ప్రియదర్శి, తులసి శివమణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల
డైరెక్టర్ : అయోధ్య కార్తీక్
ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి
రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017
రవి, మేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి ఏ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.
ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. ఈ లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడం, దానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్, సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..? వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

=============================

లై
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017
‘లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.