జీ సినిమాలు - ఆగస్ట్ 22

Friday,August 21,2020 - 11:35 by Z_CLU

తుంబ
నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్
ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి
డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.
ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019
అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ
విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================

బ్రూస్ లీ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

=========================

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్
పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

=========================

ఆకాశగంగ 2
నటీనటులు – రమ్యకృష్ణ, వీణా నాయర్, విష్ణువినయ్, శ్రీనాథ్ భాసి, ప్రవీణ, సతీష్ కృష్ణ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – వినయన్
సంగీతం – బిజిబుల్
సినిమాటోగ్రఫీ – ప్రకాష్ కుట్టి
నిర్మాణం – ఆకాష్ ఫిలిమ్స్
నిర్మాత – వినయన్
రిలీజ్ – నవంబర్ 1, 2019
మన్యకేసరి రాజ్యం యొక్క యువరాణి ఆరతి ఒక మెడికల్ స్టూడెంట్. అతీంద్రియ శక్తులు, ఆత్మలు పరమాత్మలు ఉన్నాయని నమ్మదు. తన సంస్థానం ఒక ఆత్మ కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది అని వివరించిన వినిపించుకోదు. అలాంటి ఒక సందర్భంలో ఆరతికి సౌమిని తారసపడుతుంది. తనొక భగవత్ స్వరూపిణి. తాను ఆత్మలతో మాట్లాడగలదు. అది తెలుసుకున్న ఆరతి స్నేహితులు ఆశ్చర్యపోతారు. ఆరతిని చనిపోయిన మీ అమ్మ తోటి మాట్లాడు అప్పుడు నీకు ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించిన అపనమ్మకం పోయి ఈలాంటి శక్తులు ఉన్న మనుషులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడుతుందని చెప్పుతారు. తన స్నేహితులని తప్పు అని నిరూపించడానికి తాను సౌమిని చెప్పినట్టుగా చేయడానికి సిద్దపడుతుంది. ఆరతి తన అమ్మ తోటి మాట్లాడేలోపే ఆకాశగంగ ఉచ్చులో బిగుంచుకుపోతుంది. ఆరతిని సౌమిని ఏవిధంగా కాపాడబోతుంది? అసలు ఎందుకు ఆకాశగంగ ఆరతిని బాధిస్తుంది? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆకాశగంగ 2 చూడాల్సిందే.

=======================

అర్జున్ సురవరం
తారాగణం: నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019
అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.

============================

సాక్ష్యం
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, ఆశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వర్
డైరెక్టర్ : శ్రీవాస్
ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.
అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.
ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.