జీ సినిమాలు - ఆగస్ట్ 21

Thursday,August 20,2020 - 11:02 by Z_CLU

నాగభరణం
నటీనటులు : విష్ణువర్ధన్, దిగంత్, రమ్య
ఇతర నటీనటులు : సాయి కుమార్, రాజేష్ వివేక్, దర్శన్, సాదు కోకిల, అమిత్ తివారీ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : కోడి రామకృష్ణ
ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషి, సోహెల్ అన్సారి, ధవళ్ గాద
రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016
సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది.
శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస… నాగ్ చరణ్ (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసింది? చివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా స్టోరీ.

=========================

బొమ్మరిల్లు
నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ,
సురేఖా వాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006
తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

===============================

పండగచేస్కో
నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్,
పవిత్ర లోకేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : రవి కిరీటి
రిలీజ్ డేట్ : 29 మే 2015
రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=================================

ముందడుగు
నటీ నటులు : సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద
ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ,
గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సూర్య కాంతం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K. చక్రవర్తి
డైరెక్టర్ : K. బాపయ్య
ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు
రిలీజ్ డేట్ : 1983
శోభన్ బాబు, కృష్ణ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందడుగు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులిద్దరూ అన్నాదమ్ములని తెలుసుకునే సన్నివేశం సినిమాకే హైలెట్. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

===============================

శైలజారెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ : మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

=============================

జై చిరంజీవ
నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.