జీ సినిమాలు - ఏప్రిల్ 9

Wednesday,April 08,2020 - 09:01 by Z_CLU

అఖిల్
నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్
రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015
అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

===========================

అదిరిందయ్యా చంద్రం
నటీనటులు – శివాజీ, లయ
ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి
రిలీజ్ డేట్ – 2005, ఆగస్ట్ 20
శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం. శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

============================

దువ్వాడ జగన్నాథమ్
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 23 జూన్ 2017
విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

===================================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ : 20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

====================================

ఇద్దరమ్మాయిలతో
నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్
ఇతర నటీనటులు: బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

=========================

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి
వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది.
ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు?

కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.