ZeeCinemalu - Apr 13

Monday,April 12,2021 - 10:28 by Z_CLU

london-babulu-zee-cinemalu-1172x551

లండన్ బాబులు
నటీనటులు : స్వాతి, రక్షిత్
ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్ : కె.
డైరెక్టర్ : చిన్నికృష్ణ
ప్రొడ్యూసర్ : మారుతి
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017
అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

==============================

Pellam Oorelithe fpc పెళ్లా ఊరెళితే zeecinemalu

పెళ్లాం ఊరెళితే
నటీనటులు: శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత,గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, సుమన్ శెట్టి తదితరులు
దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
రచన: చింతపల్లి రమణ (మాటలు)
కథ: శక్తి చిదంబరం
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: సిరి మీడియా ఆర్ట్స్
శ్రీకాంత్, వేణు హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పెళ్లాం ఊరెళితే. సంగీత, రక్షిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయాల బేధాలు, గిల్లికజ్జాల్ని సరదాగా చూపించింది ఈ సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2003లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సునీల్ కామెడీ, మణిశర్మ సంగీతం ఎక్స్ ట్రా ఎట్రాక్షన్స్.

===========================

agent-bhairava-poster-919x613

ఏజెంట్ భైరవ
నటీ నటులు : విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు
దర్శకత్వం: భరతన్
నిర్మాత : బెల్లం రామకృష్ణ
విడుదల : 7 జులై 2017
ఇళయ దళపతి విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా జగపతిబాబు విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్ భైరవ’. పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకం బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. భరతన్‌ దర్శకుడు.

===========================

iSmart-Shankar-fpc-zeecinemalu-427x320

ఇస్మార్ట్ శంకర్
నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్
రిలీజ్ డేట్ : జులై 18, 2019
ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది.
తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్).
ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

==========================

mr-majnu-zeecinemalu-427x320

మిస్టర్ మజ్ను
నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు
సంగీతం : థమన్
ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిడివి : 145 నిమిషాలు
విడుదల తేది : 25 జనవరి , 2019
లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు. అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది.
అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics