జీ సినిమాలు ( జూన్ 6th)

Tuesday,June 05,2018 - 09:03 by Z_CLU

గణేష్

హీరోహీరోయిన్లు – రామ్,కాజల్
నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం
సంగీతం – మిక్కీ జె మేయర్
దర్శకత్వం – శరవణన్
విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’.
2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

—————————————————————-

బంగారు బాబు 

నటీ నటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్
రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

______________________________________________________________

ఒక ఊరిలో

నటీ నటులు : తరుణ్, రాజా, సలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.


సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

_____________________________________

బలుపు

నటీ నటులు : రవితేజ, శృతి హాసన్
ఇతర నటీ నటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

___________________________________________________

కొత్త బంగారు లోకం

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.