జీ సినిమాలు (19th జనవరి )

Monday,January 18,2021 - 10:00 by Z_CLU

దొంగ

నటీనటులు – కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు
దర్శకుడు – జీతూ జోసెఫ్
బ్యానర్ – వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్
నిర్మాత – రావూరి వి శ్రీనివాస్
సంగీతం – గోవింద వసంత్
రిలీజ్ డేట్ – డిసెంబర్ 20, 2019

విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది.

గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు.

మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ ‘దొంగ’ స్టోరీ.

__________________________________________

బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

________________________________________________

మిస్టర్ పెళ్ళాం

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఇతర నటీనటులు : A.V.S., తనికెళ్ళ భరణి, గుండు సుదర్శన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జెన్నీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : గవర పార్థసారథి

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 1993

బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆణిముత్యం లాంటి సినిమా ‘మిస్టర్ పెళ్ళాం. ఈ సినిమాలో భార్యా భర్తల అనుబంధాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు బాపు గారు. ఇద్దరిలో పై చేయి, భార్యదా..? భర్తదా..? అనే ప్రశ్నకి అందంగా సమాధానం చెప్పారు బాపుగారు.

_________________________________________

రావోయి చందమామ

నటీనటులు – నాగార్జున, అంజలా ఝవేరీ, ఐశ్వర్యరాయ్, కీర్తిరెడ్డి, జగపతిబాబు
బ్యానర్ – వైజయంతీ మూవీస్
నిర్మాత – అశ్వనీదత్
దర్శకుడు – జయంత్ సి.పరాన్జీ
సంగీతం – మణిశర్మ
రిలీజ్ – అక్టోబర్ 15, 1999

నాగార్జున నటించిన లవ్-రొమాంటిక్ మూవీ రావోయి చందమామ. 1999 నాటికి భారీ బడ్జెట్ సినిమా ఇదే. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అంతేకాదు.. అందాలతార ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేయడం మరో హైలెట్.

_________________________________________

రాక్షసుడు

నటీనటులు : సూర్యనయనతార

ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్ప్రణీత సుభాష్ప్రతిభాన్రియాజ్ ఖాన్సముథిరఖనిశరత్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : వెంకట్ ప్రభు

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా

రిలీజ్ డేట్ : 29  మే 2015

సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోనుతెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

________________________________________

లీడర్

నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్
డైరెక్టర్ : శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్
రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010

రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.