జీ సినిమాలు (15 మార్చ్ 2017)

Tuesday,March 14,2017 - 09:30 by Z_CLU

నటీ నటులు : R. నారాయణ మూర్తి

డైరెక్టర్ : R. నారాయణ మూర్తి

నిర్మాత : R. నారాయణ మూర్తి

విప్లవ సినిమాల డైరెక్టర్ R. నారాయణ మూర్తి నిర్మించిన సినిమా ‘పోరు తెలంగాణ’. రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలే కథాంశంగా తెరకెక్కిన ‘పోరు
తెలంగాణ’ అన్ని సెంటర్ లలోను అద్భుతంగా అలరించింది.

————————————————————————

నటీ నటులు : అక్కినేని నాగేశ్వరావు , శ్రీ దేవి
ఇతర నటీనటులు : మోహన్ బాబు, రావు గోపాల్ రావు, సత్య నారాయణ, అల్లు రామ లింగయ్య, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి, చలపతి రావు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : కె.రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 27 జూన్ 1981

అక్కినేని నాగేశ్వరావు -శ్రీదేవి జంటగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘ప్రేమ కానుక’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించి మంచి విజయం సాధించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-ఎ.ఎన్.ఆర్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం లో ఎ.ఎన్.ఆర్ శ్రీదేవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కామెడీ ఒకెత్తయితే , చక్రవర్తి అందించిన సంగీతం మరో ఎత్తు. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ దర్శకేంద్రుడి స్క్రీన్ ప్లే ఆకట్టుకొనే సన్నివేశాలతో ఈ చిత్రం అలరిస్తుంది.

———————————————————————————–

నటీ నటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్
రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

————————————————————————–


నటీనటులు : గౌతమ్, శాంభవి
మ్యూజిక్ డైరెక్టర్ : మహేష్ శంకర్
డైరెక్టర్ : మహి
ప్రొడ్యూసర్ : మహేశ్వర రావు
రిలీజ్ డేట్ : 29 జనవరి 2011

కథ పాతదే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే తో సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి. రిషి, సంధ్య ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం ముందుగా కోటీశ్వరుడైన సంధ్య తండ్రి దేవన్ కి చెప్తారు. ఆయన కూడా అసలే ఇబ్బంది లేకుండానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు. ఇక రిషి వాళ్ల అమ్మకు చెప్పుకుందామని బయలుదేరినప్పుడు దారిలో రిషి పై ఎటాక్ జరుగుతుంది. అసలు రిషిని చంపాలి అనుకున్నదెవరు..? సంధ్య తండ్రి మనస్పూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా..? లేక జస్ట్ నటించాడా..? అన్నది ZEE Cinemalu లో చూడాల్సిందే.

————————————————————————-

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

————————————————————————–

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి
ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ
డైరెక్టర్ : సురేష్ వర్మ
ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

————————————————————————

నటీ నటులు : ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్, ఆశిష్ విద్యార్థి
మ్యూజిక్ డైరెక్టర్ : S.A.రాజ్ కుమార్
డైరెక్టర్ : S. మహేందర్
నిర్మాత : డి. రత్న కుమార్

ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా సమర సింహా. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ రచించడం విశేషం. ఉపేంద్ర తో పాటు ఆశిష్ విద్యార్థి నటన సినిమాకు హైలెట్.