Hello World : T-Hubలో ప్రీ-రిలీజ్ ఈవెంట్

Sunday,August 14,2022 - 12:50 by Z_CLU

ZEE5’s ‘Hello World’ pre-release event was held at T-Hub

ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ,మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి.

తాజాగా సదా, ఆర్యన్ రాజేష్ లు కూడా OTT అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ‘ ఆగస్టు 12 నుండి ZEE 5 లో స్ట్రీమ్ లో అవుతూ వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సిరీస్ వీక్షకులకు ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. దీని ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేశారు. కార్పొరేట్ ప్రపంచం లోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై తో కలసి నిహారిక కొణిదల కొలబ్రేషన్ తో ZEE5 నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు శివసాయి వర్ధన్ జలదంకి చాలా చక్కగా తెరకేక్కించడం జరిగింది ..

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ఈ నెల 12 న ZEE5 లో స్త్రీమ్ అవుతున్న సందర్బంగా “హలో వరల్డ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని టి. హబ్ లో వెబ్ సిరీస్ టీం ఘనంగా జరుపు కున్నారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహా శెట్టి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వచ్చిన విశ్వక్ సేన్, నేహా శెట్టి లకు ధన్యవాదములు.ఐటి లో పని చేయడానికి వచ్చిన యువతీ యువకుల అనుభవాలతో రూపిందించిన రొమాంటిక్ డ్రామా గా వస్తున్న హలో వరల్డ్ వెబ్ సిరీస్ పింక్ ఎలిఫెంట్ కు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను . దర్శకుడు సాయి చాలా టఫ్ డెడ్ లైన్స్ తో చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు.తన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది.టెక్నీకల్ టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు నటీ నటులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు.ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి కూడా థాంక్స్ చెప్పాలి. ఇందులో కొంతమంది చిన్న క్యారెక్టర్స్ చేసిన కూడా చాలా బాగా చేశారు OCFS చేసిన దర్శకుడు మహేష్ గారు కూడా నాకు బ్యాక్ బోన్ గా ఉండి హెల్ప్ చేశారు.అలాగే నాకు సపోర్ట్ గా నిలిచిన ZEE5 టీం కు ధన్యవాదములు అన్నారు.

hello world zee5