Maa Neella Tank సిరీస్ పై ఆసక్తి పెంచేస్తున్న ట్రైలర్

Friday,July 08,2022 - 06:01 by Z_CLU

ZEE5 : Sushanth’s ‘Maa Neella Tank’ Trailer Talk

సుశాంత్ , ప్రియా ఆనంద్ జంటగా లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఫన్ ఎంటర్తైనింగ్ సిరీస్ ‘మా నీళ్ళ ట్యాంక్’ ట్రైలర్ విడుదలైంది. స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే  సోషల్ మీడియాలో తెలుగు, తమిళ్ ట్రైలర్ ని రిలీజ్ చేసి సుశాంత్ అండ్ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.  సుశాంత్  వంశీ పాత్రలో పోలీస్ గా ఉద్యోగ భాద్యతలు తీసుకొని ఊళ్ళో ఎంట్రీ ఇవ్వడం, అక్కడ పెద్ద కేసులు లేక రిలాక్స్ అవ్వడం లాంటి విజువల్స్ తో స్టార్టయిన ట్రైలర్ లో సురేఖ అనే అమ్మాయి ఊరి నుండి వెళ్ళిపోవడం ఆ వెంటనే గోపాల్ నీళ్ళ ట్యాంక్ ఎక్కి సురేఖ వచ్చే దాక దిగనని చెప్పే సీన్ తో స్టోరీ లైన్ ఇది అని క్లియర్ గా చెప్పారు.

వంశీ పాత్రలో సుశాంత్ సరికొత్తగా కనిపిస్తూ తన కామెడీ టైమింగ్ , డిఫరెంట్ స్లాంగ్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. అలాగే ప్రియా ఆనంద్ కేరెక్టర్ కి స్టోరీలో ఎంత ఇంపార్టెన్స్ ఉండనుందో తెలుస్తుంది. ట్రైలర్ లో సుశాంత్ -ప్రియా ఆనంద్ మధ్య వచ్చే లవ్  సీన్స్ కూడా ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. అలాగే సుదర్శన్ తన కామెడీతో హిలేరియస్ గా నవ్వించనున్నాడని ట్రైలర్ లో కొన్ని కామెడీ  సీన్స్ చూస్తే తెలిసిపోతుంది.

బుచ్చివోలు గ్రామంలో ఉండే మనుషులు అక్కడే జరిగే విషయాలను సరదాగా చూపిస్తూ ఫన్ రైడ్ గా రూపొందుతున్న ‘మా నీళ్ళ ట్యాంక్’ సిరీస్ టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొని  ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రవీణ్ కొల్ల నిర్మించిన ఈ సిరీస్ కి రాజ్ శ్రీ బిశ్ట్ , సురేష్ మైసోర్ అందించారు. కిట్టు విస్సాప్రగడ మాటలు రాసాడు.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్‌ సీరిస్‌ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

మా నీళ్ళ ట్యాంక్ .. జులై 15నుండి ZEE5 లో