Zee5 Puli-Meka - ఆది సాయికుమార్ హీరోగా వెబ్ సిరీస్

Monday,June 20,2022 - 12:18 by Z_CLU

ZEE5 launches new web series titled ‘Puli-Meka’

ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ , ఇటీవల ‘రెక్కీ ‘తో ZEE5 మంచి హిట్ ను అందుకుంది .ఇప్పుడు తాజాగా “పులి – మేక” వెబ్ సిరీస్ ను లాంచ్ చేసింది ZEE5.

కోన ఫిలిం కార్పొరేషన్ తో కలిసి జీ5 చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి – మేక”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటించడం విశేషం. గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & ZEE5 సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశం తో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక ’ వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాల తో పోటీ పడుతున్నాయి.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ పులి – మేక వెబ్ సిరీస్ తో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ ఓటీటీ డెబ్యూ ఇస్తున్నారు.

ఇక “పులి – మేక” వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది . పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకర్ని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు, జాతకాలతో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత.