ఆరంభం ఒక్క అడుగుతోనే... కరోనాపై పోరులో జీ తెలుగు

Wednesday,October 14,2020 - 09:46 by Z_CLU

తెలుగు ప్రజలకు వినోదాన్ని అందించడంలోనే కాదు.. సామాజిక బాధ్యతలో కూడా ముందుంది మీ జీ తెలుగు. కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధానికి తనవంతుగా మద్దతు పలికింది. 10 అంబులెన్సులు, 4వేల PPE కిట్లు అందించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఇది సరైన సాయం. రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీళ్ల సేవలకు అంబులెన్సులు అత్యవసరం. ఇక ఫ్రంట్ వారియర్స్ కు PPE కిట్లు చాలా అవసరం.

అందుకే తనవంతు సామాజిక బాధ్యతగా జీ తెలుగు ముందుకొచ్చింది. ఛానెల్ హెడ్స్ అనురాధ గారు, సాయిప్రకాష్ గారు, శ్రీధర్ గారు… ఆధ్వర్యంలో అంబులెన్సులు, పీపీఈ కిట్లను ఏపీ ప్రభుత్వానికి అందించారు.

రాష్ట్ర రవాణా, సమాచార-ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని గారు, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా గారు ఈ అంబులెన్సుల్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రోజా అంబులెన్స్ నడిపారు. జీ తెలుగు చూపించిన చొరవను మంత్రి నాని, ఎమ్మెల్యే రోజా ప్రత్యేకంగా అభినందించారు.