జీ తెలుగు సినీ అవార్డ్స్ - మరింత స్పెషల్ కానున్న వీకెండ్

Wednesday,January 23,2019 - 10:03 by Z_CLU

ఈ వీకెండ్ మరింత స్పెషల్ కానుంది. మన ఫేవరేట్ స్టార్స్ ప్రతి తెలుగింట్లో సందడి చేయనున్నారు. రీసెంట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ సినీ అవార్డ్స్ 2018 పండగ, ఈ నెల 26, 27 తేదీలలో జీ తెలుగులో టెలీకాస్ట్ కానుంది. వరస అవార్డులతో, స్టార్స్ స్పెషల్ పర్ఫామెన్స్ లతో మరింత కలర్ ఫుల్ గా మారనుంది ఈ వీకెండ్.

జ్యూరీ అవార్డ్స్, ఫేవరేట్ అవార్డ్స్, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అని 3 స్పెషల్ కేటగిరీలలో ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది జీ తెలుగు. తెలుగు సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో సేవలందించిన ప్రముఖులు ఈ ప్రెస్టీజియస్ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డ్స్ ప్రధానంతో పాటు ప్రముఖ స్టార్స్ చేసిన స్పెషల్ పర్ఫామెన్సెస్ ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకు వచ్చాయి.

నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్ లాంటి సినీ దిగ్గజాలు ఈ కార్యక్రామానికి అటెండ్ అయ్యారు. దానికి తోడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వినూత్న పద్ధతిలో ఘన నివాళి అర్పించింది జీ తెలుగు. దీంతో పాటు దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి సుందరం మాస్టర్ చేసిన డ్యాన్స్ ఈ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచింది.

ప్రతిసారి ఏదో కొత్తదనంతో, ప్రత్యేక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేసే జీ తెలుగు, ఈ కొత్త సంవత్సరంలో మరింత కలర్ ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురానుంది. ఈ వీకెండ్ అంటే శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల నుండి మీ ఫేవరేట్  జీ తెలుగు, జీ తెలుగు HD లో అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించండి.