జీ సినిమాలు స్పెషల్ : టాలీవుడ్ లో ఉగాది హంగామా !

Thursday,March 12,2020 - 03:00 by Z_CLU

ప్రతీ పండుగకి కొన్ని సినిమాలకు సంబంధించి ఏదో ఒక ప్రమోషన్ ప్రారంభిస్తారు. ఇక తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన ఉగాది పండుగకైతే ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్స్ , టైటిల్ అనౌన్స్ ఇలా ఏదొ ఒకటి వదలడం, కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ ప్రేక్షకులను ఆనందింపజేయడం సహజమే.ఈ ఏడాది కూడా ఉగాది కి ప్రేక్షకులకు ఓ మూడు టాప్ సినిమాల నుండి అప్డేట్స్ అందనున్నాయి. అవును మెగా స్టార్ . పవర్ స్టార్ , రెబల్ స్టార్ ఇలా ముగ్గురు స్టార్ హీరోల సినిమాల నుండి ఫస్ట్ లుక్ , టీజర్ రాబోతున్నాయి.

మెగా స్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘ఆచార్య’ టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్లు ప్రకటించారు చిరు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఉగాది నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మెగా ఫ్యాన్స్ లో నెలకొంటుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ టీజర్ ను ఉగాది రోజు మార్చ్ 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన పవన్ టీజర్ ఎలా కనిపిస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. పైగా రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ నుండి సినిమా టీజర్ వస్తుండటంతో ఈ ఉగాది ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ గా మారనుంది.

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కి సంబంధించి ఇంత వరకూ టైటిల్ చెప్పకుండా ఫ్యాన్స్ ను వెయిటింగ్ మోడ్ లో పెట్టిన మేకర్స్ ఎట్టకేలకు టైటిల్ ను అనౌన్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండిటికి ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు. ఆ రోజు నుండే సినిమా ప్రమోషన్స్ అఫీషియల్ గా మొదలు పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపాలని చూస్తున్నారు.