జీ స్పెషల్ : మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీస్

Sunday,January 26,2020 - 12:02 by Z_CLU

ఏ సీజన్ లో అయినా థియేటర్స్ లో సందడి చేసే సత్తా ఒక్క లవ్ స్టోరీస్ కే ఉంటుంది. జస్ట్ సినిమాలో లవ్ ట్రాక్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలే కానీ ఆ ప్రేమకథను గుండెల్లో పెట్టుకొని కలెక్షన్స్ రూపంలో వారి ప్రేమను తిరిగిస్తారు. ఈ ఏడాది మూవీ లవర్స్ ని కదిలించడానికి కొన్ని మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీస్ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఆన్ స్క్రీన్ మీద మేజిక్ చేయడానికి వస్తున్న లవ్ స్టోరీస్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఈ ఇయర్ మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీస్ లో మొదటి స్థానంలో ఉన్న సినిమా ‘జాను’. 2018 లో కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన లవ్ స్టోరీ ’96’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని లవ్ స్టోరీస్ ఇష్టపడే వారితో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ లో శర్వా -సమంత పెయిర్ ఎట్రాక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7 థియేటర్స్ లోకి రాబోతుంది. మరి శర్వా – సమంత ఈ రీమేక్ లవ్ స్టోరీతో ఎలా ఇంప్రెస్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

 ఒకే సినిమాలో మూడు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను లవ్ లో పడేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రాజు’ లాంటి క్లీన్ లవ్ స్టోరీతో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఈ ప్రేమకథను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ సినిమాగా రిలీజవుతున్న ఈ లవ్ స్టోరీతో విజయ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

 ఫిబ్రవరి 21న నితిన్ , రష్మిక జంటగా తెరకెక్కిన ‘భీష్మ’ థియేటర్స్ లోకి రానుంది. ఎప్పటికి సింగిల్ గా ఉండాలనుకునే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక, ఆ ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్ళాడనే కథతో రొమాంటిక్ ఎంటర్టైన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఇయర్ ఎవైటింగ్  లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ఇటివలే రిలీజయిన టీజర్ లో  నితిన్ -రష్మిక కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవ్వనుందనే సంగతి అర్థమవుతుంది. ఇక లవ్ స్టోరీ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్టవ్వడం ఖాయం.

కొన్ని కాంబినేషన్ లో వచ్చే లవ్ స్టోరీస్ ఆడియన్స్ కి స్పెషల్ అనిపిస్తాయి. అయితే నాగ చైతన్య , సాయి పల్లవి కాంబో వస్తున్న ‘లవ్ స్టోరీ’ కూడా మూవీ లవర్స్ ని స్పెషల్ మూవీగా  ఎట్రాక్ట్ చేస్తోంది. పైగా ఎలాంటి లవ్ స్టోరీతో అయినా ఫిదా చేసే శేఖర్ ఈ ప్రేమకథను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక టైటిల్ తోనే ఈ ఇయర్ ఓ క్లీన్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నారని హిట్ ఇచ్చారు. ఈ స్పెషల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లో థియేటర్స్ లోకి రాబోతుంది.

అఖిల్ కూడా ఈ ఇయర్ తన లవ్ స్టోరీ చెప్పడానికి రెడీ అవుతున్నాడు. పూజా హెగ్డే తో ఎలా ప్రేమలో పడ్డాడో స్క్రీన్ పై చూపించబోతున్నాడు. ఈ కాంబో సినిమాను ‘బొమ్మరిల్లు’ , ‘ఆరెంజ్’ లాంటి లవ్ స్టోరీస్ తో మెస్మరైజ్ చేసిన భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రేమకథపై అందరి దృష్టి పడింది. సమ్మర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి అఖిల్ -పూజ ల లవ్ స్టోరీ ఎలా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

ఈ ఇయర్ ‘రంగ్ దే’ కూడా స్పెషల్ లవ్ స్టోరీగా అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. నితిన్ , కీర్తి సురేష్ కాంబినేషన్ , రెండు లవ్ స్టోరీస్ ను డీల్ చేసిన వెంకీ అట్లూరి డైరెక్షన్ ఈ  సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ రైజ్ అయ్యేలా చేస్తోంది. ఈ లవ్ స్టోరీ కూడా సమ్మర్ లోనే విడుదలవ్వనుంది.

ఈ ఏడాది కొన్ని స్పెషల్ లవ్ స్టోరీస్ తో పాటు ‘ఉప్పెన’ అనే  పిరియాడిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఓ కొత్త అనుభూతి అందించనుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ స్టోరీతో మెగా ఫ్యామిలీ నుండి  వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ ప్రేమకథ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.