జీ స్పెషల్ : హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీస్

Sunday,March 15,2020 - 01:10 by Z_CLU

ప్రతీ ఏడాది సమ్మర్ లో కొన్ని కూల్ లవ్ స్టోరీస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసి సూపర్ హిట్ సాదిస్తుంటాయి . ఈ ఏడాది కూడా రెండు లవ్ స్టోరీస్ ప్రేక్షకులను ప్రేమలో పడేసి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరి’ కాగా మరొకటి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ‘ఉప్పెన’. ఈ కూల్ లవ్ స్టోరీస్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అంటే ఓ సెపరేట్ బ్రాండ్. ఆ బ్రాండ్ లవ్ స్టోరీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరి’ గురించి ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్ అనిపించే చైతూ, కళ్ళతో అభినయం చూపించే సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ ప్రేమకథ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న లవ్ స్టోరీ కావడంతో ఈ సమ్మర్ లో ఈ కూల్ లవ్ స్టోరీ చూస్తూ ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా మేలో రిలీజ్ కానుంది. ఈ లవ్ స్టోరీతో ఈ ముగ్గురు మరో సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకుంటారా చూడాలి.

ఈ సమ్మర్ లో డెబ్యూ డైరెక్టర్ తీసిన ‘ఉప్పెన’ సినిమా కూడా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తుంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ లవ్ స్టోరీతో కృతి శెట్టి కూడా హీరోయిన్ గా పరిచయమవుతుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కూల్ లవ్ స్టోరీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఓ అగ్ర కులానికి చెందిన అమ్మాయిను ప్రేమించే ఓ చేపలు పట్టే కుర్రాడి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి కి అందరూ ఎట్రాక్ట్ అవుతున్నారు. మరి ఈ లవ్ స్టోరీ హీరోకి దర్శకుడికి అలాగే హీరోయిన్ కి బెస్ట్ డెబ్యూ అవుతుందేమో చూడాలి.