సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న టాలెంటెడ్ సింగర్

Monday,August 01,2022 - 09:44 by Z_CLU

Zee Saregamapa Singer Siva Dinavahi turns music director with Anukoni Prayanam

జీ తెలుగు ఛానెల్ ఎంతో మంది కొత్తవాళ్లకి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తోంది.  జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సరిగమప’ షో నుండి కూడా ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ షో ద్వారా సింగర్ గా పరిచయమైన ఎస్ శివ దినవాహి  ఇటివలే ‘అతడే’ అనే సినిమాలో ‘నవ్వులే తేనె వాన’ అనే పాటతో టాలీవుడ్ సింగర్ అయ్యాడు. ఆ పాటకు గానూ ఇండస్ట్రీ నుండి మంచి అభినందనలు అందుకున్నాడు.

తాజాగా శివ దినవాహి ఓ సినిమాకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రదాన పాత్రలో వెంకటేష్ పెద్దిరెడ్ల దర్శకత్వంలో ఆపిల్ క్రియేషన్స్ బేనర్ పై జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ‘అనుకోని ప్రయాణం’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం అందుకున్నాడు శివ.

ఇటివలే ఈ సినిమా ఆల్బం నుండి రిలీజైన “ఏ కథను ఏ కంచికి” అనే సాంగ్ సూపర్ హిట్టయింది. శంకర్ మహదేవ్ లాంటి గొప్ప గాయకుడితో ఈ పాటను పాడించి మ్యూజిక్ లవర్స్ కి బెస్ట్ సాంగ్ అందించాడు శివ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాతో శివ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకొని టాలీవుడ్ లో  బిజీ మ్యూజిక్ అవ్వాలని కోరుకుంటుంది జీ సినిమాలు.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics