Zee Retro: వీళ్లిద్దరు ఎవరో గుర్తుపట్టారా?

Wednesday,December 23,2020 - 10:37 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఇవి. ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన చిన్నప్పటి ఫొటోలు ఇవి. కాస్త జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపట్టడం కూడా ఈజీ. ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.

nani_childhood_photo

ముందుగా ఈ ఫొటో విషయానికొద్దాం. నేచురల్ స్టార్ నాని చిన్నప్పటి ఫొటో ఇది. ఆ నిల్చున్న పోజు, ఆ ముక్కు చూసి గుర్తుపట్టొచ్చు. నానికి చెందిన ఈ ఫొటోను అతడి ఫ్యాన్స్ ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

sharwanand_childhood_photo

ఇక ఈ ఫొటో ఎవరిదో చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎస్.. మీ గెస్ కరెక్ట్. ఇది శర్వానంద్ ఫొటో. అదేంటో, అప్పటికీ ఇప్పటికీ శర్వానంద్ ముఖం ఒకేలా ఉంది. గడ్డాలు-మీసాలు మాత్రమే యాడ్ అయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు ఫొటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. చిన్నప్పుడు అమాయకంగా కనిపించిన ఈ ఇద్దరు హీరోలు, ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు.