ఈ రోజు సాయంత్రం ప్రసారం కానున్న జీ కుటుంబం అవార్డ్స్

Saturday,October 07,2017 - 12:02 by Z_CLU

ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ – 2017 హంగామాకు ఈసారి దుబాయ్ వేదికైంది. సెలెబ్రిటీల ఆటపాటలతో సరదాగా సాగిన ఈ హంగామా అక్టోబర్ 7, శనివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

ఆల్ టైమ్ స్టార్ కమెడియన్ ఆలీతో పాటు రితికా సింగ్, సీరత్ కపూర్, శాలినీ పాండే, కైరాదత్ వేసిన స్టెప్పులతో జీ కుటుంబం అవార్డ్స్ కార్యక్రమం మరింత ఎట్రాక్టివ్ గా మారింది. ఈ కార్యక్రమానికి శ్రీముఖి, రవి, ప్రదీప్ లు యాంకర్స్ గా వ్యవహరించారు.

 వీటితో పాటు ‘అమ్మా నా కోడలా’, ‘ముద్ద మందారం’, ‘అమెరికా అమ్మాయి’ సీరియల్స్ తో ఆకట్టుకుంటున్న నటీనటులు ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ సందడిని ఈ రోజు సాయంత్రం జీ తెలుగులో చూసి ఆనందించండి.