జీ గ్రూప్ సగర్వంగా సమర్పిస్తోంది...

Sunday,September 04,2016 - 11:05 by Z_CLU

తెలుగు తెరపై మరో వెలుగు అవతరించింది. జీ తెలుగు ఛానెల్ తో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జీ ఎంటర్ టైన్ మెంట్  నుంచి మరో సరికొత్త ఛానెల్ ఆవిష్కృతమైంది. తెలుగు ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు 24 గంటల మూవీ ఛానెల్ జీ సినిమాలు గ్రాండ్ గా లాంఛ్ అయింది. దిల్ పై సూపర్ హిట్ అనే పొజిషనింగ్ తో… ఇంటర్నేషనల్ ఏజెన్సీలు క్రియేట్ చేసిన హై-ఫై లుక్ తో మీ జీ సినిమాలు కలర్ ఫుల్ గా సిద్ధమైంది.

Collage1

జీ సినిమాలు ఛానెల్ కు సంబంధించిన ప్రమోషన్స్ ప్రజలందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి. దిల్ పై సూపర్ హిట్ అనే పొజిషనింగ్ తో ఏర్పాటుచేసిన హోర్డింగ్ లు, కటౌట్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. వీటికి అదనంగా ఫేస్ ఆఫ్ ది ఛానెల్, సరైనోడు ఫేం విద్యుల్లేఖతో తెరకెక్కించిన ప్రోమోలు సూపర్ హిట్ అయ్యాయి. ఇవన్నీ కలిసి జీ సినిమాలు ఛానెల్ ఎప్పుడు వస్తుందా అనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఫైనల్ గా అందరి ఎదురుచూపులు ఫలించాయి. సెప్టెంబర్ 4, మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు              జీ సినిమాలు ఛానెల్  అట్టహాసంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా జీ తెలుగు ఛానెల్ ప్రారంభమై అందరి మనసుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు జీ సినిమాలు 24 గంటల మూవీ ఛానెల్ కూడా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తోనే ప్రారంభమైంది.

 Zee CInemalu Launch Creative 3

ఎన్నో స్పెషల్ ఎట్రాక్షన్ తో లాంచ్ అయింది మీ జీ సినిమాలు. ప్రతి రోజూ ఓ సూపర్ హిట్ సినిమాతో పాటు… దక్షిణాది టెలివిజన్ రంగంలోనే తొలిసారిగా “7 డే – 7 ప్రీమియర్” లను జీ సినిమాలు ఛానెల్ లో మాత్రమే చూడొచ్చు. వీటితోపాటు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, మూవీ ఆఫ్ ది మంత్ లాంటి ఎన్నో ఎట్రాక్షన్స్ జీ-సినిమాలు సొంతం. ఇప్పటికే ఉన్న హిట్ సినిమాల లైబ్రరీతో పాటు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించడం కోసం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి దాదాపు 70కి పైగా సినిమాల హక్కుల్ని జీ గ్రూప్ దక్కించుకుంది. ఇవన్నీ త్వరలోనే మీ జీ సినిమాలు ఛానెల్ లో అలరించబోతున్నాయి.

 website & fb

తెలుగు టీవీ రంగంలోనే తొలిసారిగా… మూవీ ఛానెల్ తో పాటు తెలుగు-ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి వెబ్ సైట్ ను తీసుకొచ్చి… టాలీవుడ్ కు చెందిన లేటెస్ట్ అప్ డేట్స్, బాక్సాఫీస్ వివరాలు, సమీక్షలు లాంటి సమస్త సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది              మీ జీ సినిమాలు. వెబ్ సైట్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా జీ సినిమాల్ని ఫాలో అయి లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.