జీ ఎక్స్ క్లూజీవ్ : "మైత్రీ"లో ఇద్దరు యంగ్ డైరక్టర్స్

Monday,July 22,2019 - 12:15 by Z_CLU

‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై త్వరలోనే ఇద్దరు యంగ్ డైరక్టర్స్ మెరవబోతున్నారు. వాళ్లే వివేక్ ఆత్రేయ, స్వరూప్ ఆర్ఎస్జే. వీళ్లిద్దరూ త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నారు. వీళ్లలో ముందుగా ఈ బ్యానర్ లో సినిమా చేసేది మాత్రం వివేక్ ఆత్రేయ.

 ‘మెంటల్ మదిలో’ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ రీసెంట్ గా ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తో మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. హీరోహీరోయిన్ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

 ఈ బ్యానర్ లో అవకాశం అందుకున్న మరో దర్శకుడు స్వరూప్. స్మాల్ మూవీగా వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. కాకపోతే ఇప్పటికిప్పుడు “మైత్రీ”లో ఇతడు సినిమా చేయకపోవచ్చు. ఆల్రెడీ కమిటైన ఓ సినిమాను పూర్తిచేసి, ఆ తర్వాత మైత్రీలో సినిమా చేస్తాడని సమాచారం.

 ఇలా ఇద్దరు యంగ్ డైరక్టర్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్.