జీ ఎక్స్ క్లూజీవ్ : 'సరిలేరు' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్

Tuesday,November 12,2019 - 01:06 by Z_CLU

వచ్చే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే రిలీజ్ కి మరో రెండు నెలలే ఉండటంతో రెండు సినిమాలు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశాయి. ఇప్పటికే బన్నీ సినిమా నుండి రెండు పాటలు రిలీజై అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. అవును మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ని డిసెంబర్ 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఆల్బం నుండి ఫస్ట్ రిలీజయ్యే ఆ సాంగ్ ఏంటనేది తెలియాల్సి ఉంది. అదే నెలలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం. సో డిసెంబర్ 1 నుండి మహేష్ -దేవి కాంబో ‘సరిలేరు నీకెవ్వరు’ సాంగ్స్ తో హంగామా చేయనుందన్నమాట.