జీ ఎక్స్ క్లూజీవ్ : మహేష్ టైటిల్ పై క్లారిటీ

Sunday,May 19,2019 - 01:29 by Z_CLU

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నుండి  సెట్స్ పైకి రానుంది. అయితే  ఈ సినిమాకు ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారంటూ సోషల్ మీడియాలో టైటిల్ హల్చల్ చేస్తోంది. ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

“సినిమాకు ఇంకా ఎలాంటి  టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘రెడ్డి గారి అబ్బాయి’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు ఈ టైటిల్ ని కన్సిడర్ కూడా చేయలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

సో అనిల్ రావిపూడి ఇచ్చిన ఈ క్లారిటీతో మహేష్ సినిమాకి టైటిల్ ఫిక్స్ అవ్వలేదని తెలిసిపోయింది.  ఈ సినిమాకు అదిరిపోయే ఓ మాస్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. అన్ని కుదిరితే ప్రారంభం రోజే టైటిల్ ఫైనల్ చేసి అనౌన్స్ చేసే చాన్స్ ఉంది.