జీ ఎక్స్ క్లూజీవ్ : ఫ్యామిలీ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్

Monday,May 27,2019 - 03:13 by Z_CLU

నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. టాలీవుడ్ లో ఫ్యామిలీ డైరెక్టర్ అనిపించుకున్న సతీష్ వేగేశ్నతో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే కళ్యాణ్ రామ్ కి  ఫీల్ గుడ్ కథ వినిపించాడు సతీష్. ‘118’ తో హిట్ ట్రాక్ ఎక్కిన నందమూరి హీరో సతీష్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయి…వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ద్వారా ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగనుంది. జూన్ లేదా జులై లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇక విరించి వర్మతో ఆ మధ్య కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతునట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇప్పుడా సినిమా క్యాన్సెల్ అయినట్టు సమాచారం. ఈ గ్యాప్ లోనే కళ్యాణ్ రామ్ సతీష్ తో సినిమా సెట్ చేసేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి కళ్యాణ్ రామ్ ని సతీష్ వేగేశ్న ఎలా ప్రెజెంట్ చేస్తాడో..చూడాలి.