ఎక్స్ క్లూజివ్: హరీష్ శంకర్ ఫస్ట్ ప్రాజెక్ట్ రెడీ!

Friday,June 19,2020 - 01:59 by Z_CLU

ఇదేంటి ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ఫస్ట్ ప్రాజెక్ట్ రెడీ ఏంటనుకుంటున్నారా ? అవును ఇక్కడ చెప్పుకోబోయేది హరీష్ మొదటి సినిమా గురించి కానీ అది ఆయన నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా.

అవును… ‘గద్దలకొండ గణేష్’తో మంచి విజయం అందుకొని త్వరలో మరోసారి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్ నిర్మాతగా కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యాడు. దర్శకుడిగా బిజీగా ఉండటంతో మరో నిర్మాత మహేష్ కోనేరుతో కలిసి కంబైన్డ్ గా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నాడు.

అందులో భాగంగా ప్రణీత్ అనే యంగ్ డైరెక్టర్ తో మొదటి సినిమా నిర్మించబోతున్నారు. నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రణీత్. అంతకుముందు ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్  కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు రెండో సినిమా కోసం క్రైమ్ కామెడీ కథను సిద్ధం చేసుకున్నాడు.

తాజాగా నిర్మాతలు హరీష్ శంకర్, మహేష్ కోనేరు కథ విని ప్రాజెక్ట్ ఒకే చేసి దర్శకుడికి అడ్వాన్స్ కూడా అందించారని సమాచారం. ఇంకా హీరో మిగతా కాస్టింగ్ ఫైనల్ కావాల్సి ఉంది. లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెడతారు.