జీ సినిమాలు ( 26th అక్టోబర్)

Wednesday,October 25,2017 - 10:00 by Z_CLU

తెలుగమ్మాయి

నటీనటులు : సలోని, షఫీ

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : రాజా వన్నెంరెడ్డి

ప్రొడ్యూసర్ : వానపల్లి బాబు రావు

రిలీజ్ డేట్ : అక్టోబర్ 14,2011

సలోని పదహారణాల తెలుగమ్మాయి గా నటించిన చిత్రం ‘తెలుగమ్మాయి’ రాజా వన్నేం రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు…


మహానంది

హీరోహీరోయిన్లు  – సుమంత్, అనుష్క
నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్
సంగీత దర్శకుడు – కృష్ణమోహన్
దర్శకుడు – సముద్ర
విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.


కథా నాయకుడు
నటీ నటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.


జాన్ అప్పారావ్ 40+

నటీనటులు : కృష్ణ భగవాన్సిమ్రాన్

ఇతర నటీనటులు : ఆలీకొండవలస లక్ష్మణ రావుసాయాజీ షిండేమెల్కోటేజయ ప్రకాష్ రెడ్డిరఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కిరణ్ వారణాసి

డైరెక్టర్ : కూచిపూడి వెంకట్

ప్రొడ్యూసర్ : కూచిపూడి వెంకట్

రిలీజ్ డేట్ : 20 మార్చి 2008

కృష్ణ భగవాన్సిమ్రాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ జాన్ అప్పారావు 40+. కూచిపూడి వెంకట్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.


మగమహారాజు

నటీనటులు : విశాల్, హన్సిక
ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సుందర్ C.
ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.


పాండు రంగడు

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ
ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : రాఘవేంద్ర రావు
నిర్మాత : కృష్ణమోహన రావు
రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.