జీ సినిమాలు ( 24th అక్టోబర్)

Tuesday,October 24,2017 - 09:00 by Z_CLU

వాన
నటీ నటులు : వినయ్ రాయ్, మీరా చోప్రా
ఇతర నటీ నటులు : సుమన్, నరేష్, జయసుధ, సీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S.నారాయణ, కృష్ణుడు తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : కమలాకర్
డైరెక్టర్ : శ్రీకాంత్ బుల్ల
ప్రొడ్యూసర్ : M.S.రాజు
రిలీజ్ డేట్ : 15 జనవరి 2008

హిట్ సినిమాల నిర్మాత M.S.రాజు రచించి, నిర్మించిన అద్భుత ప్రేమ కథా చిత్రం వాన. వినయ్ రాయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి కమలాకర్ సంగీతం అందించాడు.


దేవత

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి
నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.


భాయ్
నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్ దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి
ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున
రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.


సంఘర్షణ

నటీనటులు : చిరంజీవి, విజయ శాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 న సెట్స్ పైకి వచ్చిన ఈ
సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.


సూపర్ పోలీస్
నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య
ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్
డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు
ప్రొడ్యూసర్ : D. సురేష్
రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆసిదేంట్ వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.