జీ సినిమాలు (22nd ఆగష్టు)

Monday,August 21,2017 - 10:07 by Z_CLU

తాజ్ మహల్

నటీనటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

కథా నాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

మొగుడు

నటీనటులు : గోపీచంద్, తాప్సీ పన్ను

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు  పక్కా రొమాంటి ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

బావ

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు ZEE Cinemalu లో చూడాల్సిందే.

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

నా పేరు శివ

నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ :  సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా

రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010

సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ.  యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.