జీ సినిమాలు ( 19th ఆగష్టు)

Friday,August 18,2017 - 10:03 by Z_CLU

సైనికుడు

నటీ నటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

==============================================================================

మహానంది

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

నటీనటులు : వెంకటేష్త్రిష

ఇతర నటీనటులు : శ్రీకాంత్, K. విశ్వనాథ్కోట శ్రీనివాస రావుస్వాతి రెడ్డిసునీల్ప్రసాద్ బాబుసుమన్ శెట్టి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ శ్రీ రాఘవ

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007  

ఇతర నటీనటులు : శ్రీకాంత్, K.  వెంకటేష్త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

==============================================================================

 

నేనేం చిన్నపిల్లనా..? 

నటీ నటులు : రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్

ఇతర నటీనటులు : సంజనా గల్రాణి, శరత్ బాబు, సుమన్, రఘుబాబు, L.B.శ్రీరామ్, కాశీ విశ్వనాథ్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : P. సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 8 నవంబర్ 2013

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ ఫిలిం ‘నేనేం చిన్నపిల్లనా..’. నిజానికి దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ‘పట్టుదల’ అని డిసైడ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక ‘నేనేం చిన్నపిల్లనా’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ హీరో హీరోయిన్ లు గా నటించారు. M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్

ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్ : సూర్య, పాండిరాజ్

రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

=============================================================================

 

 

మగమహారాజు

నటీనటులు : విశాల్, హన్సిక

ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సుందర్ C.

ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.  

==============================================================================

శివ 

నటీనటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.