జీ సినిమాలు (18th సెప్టెంబర్)

Sunday,September 17,2017 - 10:06 by Z_CLU

కోతి మూక

హీరో హీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య

ఇతర నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్

సంగీతం – మణిశర్మ

దర్శకత్వం – ఏవీఎస్

విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

==============================================================================

దేవత 

హీరో హీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి

ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================================================================

శ్రీ రామరాజ్యం

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, నయన తార

ఇతర నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీకాంత్, రోజా, మురళి మోహన్, M. బాలయ్య, బ్రహ్మానందం, A.V.S. తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  ఇళయరాజా

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : యలమంచిలి సాయి బాబు, సందీప్, కిరణ్

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2011

బాలకృష్ణ హీరోగా బాపు డైరెక్షన్ లో అద్భుత చిత్రం శ్రీరామ రాజ్యం. తెలిసిన కథే అయినా బాపు గారు ఒక్కో సన్నివేశానికి తనదైన శైలిలో ప్రాణం పోసి మరీ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఏకంగా 7 నంది అవార్డులను సాధించి పెట్టింది. ఈ సినిమాకు ఇళయ రాజా సంగీతం అందించారు.

==============================================================================

 

రామ్  

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. శంకర్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

=============================================================================

 

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

గణేష్ జస్ట్ గణేష్

హీరో హీరోయిన్లు – రామ్,కాజల్

ఇతర నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం      – మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ – 2009

రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.