జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 02,2020 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’

హీరో నాగ శౌర్య రచయితగా మారి సొంత కథతో రమణ తేజ డైరెక్షన్ లో ‘అశ్వథ్థామ’  సినిమా చేసాడు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటివలే థియేటర్స్ లోకొచ్చింది. మరి నాగ శౌర్య కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…? ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ కొత్త హీరో సినిమాను ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. కానీ పెళ్లిచూపులు, మెంటల్ మదిలో లాంటి సినిమాలు తీసిన మేకర్స్ నుంచి మరో సినిమా వస్తుందంటే కచ్చితంగా చూడాలనిపిస్తుంది. అదే బజ్ తో థియేటర్లలోకి వచ్చింది ‘చూసీ చూడంగానే’ సినిమా. మరి ఈ సినిమా చూడగానే నచ్చుతుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ రిలీజ్ చేశారు. టైటిల్ తో పాటు మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అలా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన టక్ జగదీష్ మూవీ స్టార్ట్ అయింది.  పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ ఈవెంట్ కు కొరటాల శివ స్పెషల్ గెస్ట్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇచ్చట వాహనములు నిలపరాదు.. సుశాంత్ కొత్త సినిమా టైటిల్ ఇది. అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ టైమ్ లోనే తన కొత్త సినిమా టైటిల్ ను కూడా ప్రకటించాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన జాను సినిమా ట్రయిలర్  విడుదలైంది. తమిళ్ లో కల్ట్ లవ్ స్టోరీగా పేరుతెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. ట్రయిలర్ చూస్తే.. నిజాయితీగా రీమేక్ ను తెరకెక్కించినట్టు అర్థమౌతోంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.