జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,November 24,2019 - 10:00 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

స్టూడెంట్ లీడర్ కథతో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఎట్టకేలకు మళ్ళీ ఇన్నాళ్ళకి ‘జార్జ్ రెడ్డి’ రూపంలో ఓ స్టూడెంట్ లీడర్  సినిమా వచ్చింది. ఉస్మానియాలో చదువుతూ ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలతో అలరించి ఆకట్టుకున్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి ఓ మంచి పాత్రతో ‘తోలు బొమ్మలాట’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసాడు. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటివలే  విడుదలైంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

చాలా సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తున్నాయి. కాకపోతే అందులో నటించే నటీనటులు, స్క్రీన్ ప్లే ఆధారంగా లుక్, రిజల్ట్ మారిపోతుంది. ‘రాగల 24 గంటల్లో’ అనే థ్రిల్లర్ కూడా అలాంటిదే. ఈషా రెబ్బ లాంటి హీరోయిన్, సత్యదేవ్ లాంటి పెర్ఫార్మర్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంతకీ మూవీ రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రూలర్’ టీజర్ రిలీజైంది. సంప్రదాయానికి భిన్నంగా కేవలం బాలయ్య లుక్, డైలాగ్స్, యాక్షన్ కే పరిమితం కాకుండా.. సినిమా థీమ్ ను ఎలివేట్ చేసేలా టీజర్ కట్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని ఇటివలే రిలీజ్ చేసారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డులు ఇస్తోంది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది.

2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వైభ‌వంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.