జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,October 13,2019 - 10:11 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి మహేష్ బాబు స్టిల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇప్పటికే కొన్ని స్టిల్స్ బయటకొచ్చాయి. అయితే అవన్నీ ఒకెత్తు, దసరా సందర్భంగా విడుదలచేసిన బ్రాండ్ న్యూ పోస్టర్ మరో ఎత్తు. అవును.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేలా మహేష్ యాక్షన్ లుక్ తో రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయింది. దసరా పండగ సందర్భంగా విజయదశమి ఫెస్టివల్ సందర్భంగా యూనిట్ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పోస్టర్ లో మాసీ లుక్ లో కనిపించాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలో బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘ఆర్ ఎక్స్ 100’తో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ‘ఆర్ డి ఎక్స్ లవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో పాయల్ మరో హిట్టు అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దర్శకుడు వీవీ వినాయక్ సీనయ్యగా మారాడు. అతడు హీరోగా మారాడు అనే కంటే సీనయ్యగా మారాడని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఇది హీరోయిజం చూపించే కథ కాదు. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ. ఆ సినిమాకు సీనయ్య అనే టైటిల్ పెట్టారు. అందుకే వినాయక్ ను అంతా ఇప్పుడు సీనయ్యగా పిలుస్తున్నారు. ఈ సినిమా లాంఛ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘గద్దలకొండ గణేష్’ లో రౌడీషీటర్ గా కనిపించిన వరుణ్ తేజ్, ఇప్పుడు బాక్సర్ గా మారాడు. బాక్సింగ్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ హీరోగా ఓ కొత్త సినిమా లాంఛ్ అయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వస్తుంది. పూర్తిగా చదవదానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రానికి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ఫస్ట్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. విజయదశమి రోజున ఈ సినిమా ప్రారంభమైంది. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాల్ని తీసిన యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కల్యాణ్ రామ్ కొత్త సినిమా ఎంత మంచివాడవురా. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. దసరా శుభాకాంక్షలతో రిలీజైన ఈ టీజర్ లో కల్యాణ్ రామ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.