ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.
‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ కంటెంట్ తో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు విక్రమ్ కుమార్ తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ అంటూ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి కామెడీ రివేంజ్ సినిమాతో నాని మరో హిట్ అందుకున్నాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
‘ఫిదా’ సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆన్ లొకేషన్ లో జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్ తదితరులు పాల్గొన్నారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .
అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోంది సైరా సినిమా. తమిళ్ లో కూడా విడుదలకానున్న ఈ సినిమాకు మొన్నటివరకు డబ్బింగ్ సమస్యలు ఉండేవి. చిరంజీవి వెర్షన్ కు తమిళ్ లో ఎవరు డబ్బింగ్ చెబుతారనే సస్పెన్స్ ఉండేది. ఎట్టకేలకు ఈ ఇష్యూ క్లియర్ అయింది. తమిళ సైరాలో మెగాస్టార్ కు అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అనుష్క ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ రిలీజయింది. సినిమాలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఈ సినిమా టైటిల్ ని గతంలోనే అనౌన్స్ చేసిన మేకర్స్, ఈ రోజు ఈ పోస్టర్ తో పాటు అనుష్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది రివీల్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.