జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,August 18,2019 - 10:11 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ స్టోరీస్ టచ్ చేయడం శర్వానంద్ కు ఇష్టం. అందుకే ఇప్పటివరకు ట్రై చేయని గ్యాంగ్ స్టర్ కథాంశాన్ని సెలక్ట్ చేసుకున్నాడు. మరి గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘క్షణం’ , ‘గూఢచారి’ సినిమాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్న అడివి శేష్ ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ‘ఎవరు’ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసి మెప్పించిందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మూవీకి అల వైకుంఠపురంలో.. అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ 2 రోజులుగా సోషల్ మీడియాలో కూడా నలుగుతోంది. టైటిల్ టీజర్ లో భాగంగా బన్నీ చెప్పిన ఓ చిన్న డైలాగ్ ను కూడా రిలీజ్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా లాక్ అయింది. రీసెంట్‌గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే ఊపులో ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ఎనౌన్స్ చేశాడు ఈ డైనమిక్ డైరక్టర్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో లాంగ్ గ్యాప్ తప్పలేదు. అలా దశాబ్దానికి పైగా కెమెరాకు దూరమైన విజయశాంతి ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వచ్చారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.