జీ సినిమాలు స్పెషల్ : సంక్రాంతి సినిమాలు 2020

Wednesday,January 08,2020 - 04:16 by Z_CLU

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి సినిమాలు ఎప్పుడూ స్పెషలే.. ఆ ఏడాది ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతి సినిమాలకుండే బజ్ వేరు.. నెల ముందు నుండే ఎక్కడ చూసినా ఆ సినిమాల గురించే డిస్కషన్ నడుస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే ఈ సంక్రాంతి సినిమాలు కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తూ ఎప్పుడెప్పుడు థియేటర్స్ కెళ్ళి స్టార్ హీరోలను కలుద్దామా అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రైజ్ చేస్తున్నాయి. భారీ హైప్ తో వస్తున్న సంక్రాంతి సినిమాలపై జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ స్టోరి.

గతేడాది ‘పేట’తో సంక్రాంతికి థియేటర్స్ లో హంగామా చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి కూడా సంక్రాంతి కానుక రెడీ చేశారు. పొంగల్ స్పెషల్ గా రేపే ‘దర్బార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్, మురుగదాస్ ఫ్రెష్ కాంబోలో  వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రజనీ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో  యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో సంక్రాంతి సినిమాల హంగామా మొదలుకానుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని థియేటర్స్ లోకి దిగుతున్నాడు మరో సూపర్ స్టార్. మహేష్-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా కచ్చితంగా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే ప్రీ టాక్ సొంతం చేసుకుంది. అనీల్ మార్క్ కామెడీ , మహేష్ నటన, విజయశాంతి రీ-ఎంట్రీ ఇలా సినిమాలో చాలా స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

మహేష్ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన మరుసటి రోజే ప్రేక్షకులను ‘అల వైకుంఠపురములో’కి తీసుకెళ్ళి మెస్మరైజ్ చేయాలని చూస్తున్నాడు స్టైలిష్ స్టార్. త్రివిక్రమ్ -బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. దానికి తోడు తమన్ సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్ లో బజ్ తీసుకొచ్చాయి. పైగా సినిమాలో భారీ తారాగణం కూడా ఉంది. ఇవన్నీ సినిమా సక్సెస్ కి ఎడ్వాంటేజ్ అనిపిస్తున్నాయి.

ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమాతో పోటీలో ఉన్నాడు కళ్యాణ్ రామ్.  ‘శతమానంభవతి’తో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఓ మోస్తరు  బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలతో  సినిమా సంక్రాంతి బరిలో విజయం అందుకోవడం ఖాయమనే ప్రీ టాక్ సొంతం చేసుకుంది.